తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ విద్యార్థి రాజు సాహిత్య పురస్కారం అందుకున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనంలో రాజు పాల్గొన్నారు. తను రచించిన ఉగాది పండుగ కవితా రచనను సమ్మేళనంలో విన్పించగా వెన్నెల సాహితీ సంగమం ప్రతినిధులు, సాహితీప్రియులు, కవులు, రచయితలు రాజును ప్రత్యేకంగా అభినందించారు. కవితా రచనను ప్రోత్సహిస్తూ ‘సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య పురస్కారం’, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. పురస్కారాన్ని అందుకున్న రాజును తెయూ తెలుగు అధ్యయన శాఖ ప్రొఫెసర్ డీ కనకయ్య, అధ్యాపకులు అభినందించారు.
లింబాద్రి గుట్టను దర్శించుకున్న
ఎన్నికల కమిషన్ కార్యదర్శి
మోర్తాడ్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్‌కుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం భీమ్‌గల్ మండలంలోని లింబాద్రి గుట్టపై వెలిసిన లక్ష్మి నర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్‌కు ఆలయ వంశపారంపర్య వేద పండితులు నంబి పార్థసారథి, విజయ సారథి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఆలయ అర్చకులు నంబి వాసుదేవాచార్యులు, వేల్పూర్ వాసు, నంబి శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది రావుట్ల అరవింద్, ఎడ్ల శ్రీకాంత్, సాయిలు తదితరులు ఉన్నారు.
తెయూ విద్యార్థికి ‘సాహిత్య పురస్కారం’