అంతరిక్షం నుంచి భూమికి 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ రాక నిజంగా అంతరిక్ష శాస్త్రం, సాంకేతికతలో పురోగతికి గొప్ప రుజువు. అంతరిక్ష వాతావరణంలో సూక్ష్మజీవులు, మొక్కల మనుగడపై పరిశోధన చేసింది. యువ శాస్త్రవేత్తలు సునీతా విలియమ్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్‌వన్‌గా నిలబెట్టాలి.
– డాక్టర్ వాసం చంద్రశేఖర్, అధ్యాపకులు, తెయూ
దేశానికి గర్వకారణం
రుద్రూర్: వ్యోమగామి సునీ తా విలియమ్స్ క్షేమంగా భూ మిపై అడుగుపెట్టడం ఎంతో ఆనందం కలిగించింది. భార త సంతతికి చెందిన ఆమె సునీత అంతరిక్షంలో అధిక రోజులు ఉండి రావడం గర్వకారణం. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని నిరూపించారు.
– శ్రీకాంత్ , పొతంగల్
సునీత తెగువ స్ఫూర్తిదాయకం
బోధన్: అంతరిక్షంలో పరిశోధనకు వెళ్లి తొమ్మిది నెలల తర్వాత వచ్చిన సునీతా విలియమ్స్ సాహసం, పట్టుదల నేటి యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకం. మహిళలు ఏ రంగంలోనైనా ప్రతిభ చాటి సత్తాచాటుతారని నిరూపించారు.
– నవిత, విద్యావంతురాలు, ఠాణాకలాన్ (ఎడపల్లి)
స్ఫూర్తిమంతురాలు
సునీతా విలియమ్స్ అందరికీ స్ఫూర్తిమంతురాలు. అంతరిక్షంలో ఆమె చేసిన ప్రయాణం నిజంగా అద్భుతం. భారత సంతతికి చెందిన వ్యోమగామి కావడం గర్వకారణం.
– బాలకృష్ణ, ఆర్మూర్
అద్భుతమైన పునరాగమనం
అద్భుతమైన పునరాగమనం