నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న 50వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. నిజామాబాద్ నగర సమస్యలపై ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. నగరంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లకు రూ.4 కోట్లు మంజూరు చేయాలని, వాటిని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రధాని మోదీ ఫొటో తప్పక ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ వర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయాలని, జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ను ఆధునీకరించేందుకు నిధులివ్వాలని తెలిపారు. ఐటీ హబ్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు.
అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్