
ప్రజలకు హోలీ శుభాకాంక్షలు
నిజామాబాద్‌అర్బన్: హోలీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రాగ ద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోలీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోలీ నిర్వహించుకోవాలని కోరారు.
పోచారం రైల్వేగేటు మూసివేత
ఎడపల్లి(బోధన్): మండలంలోని పోచారం వద్దగల రైల్వేగేటును గురువారం రైల్వే సిబ్బంది మూసివేశారు. రైల్వేగేట్ వద్ద అండర్ పాస్ రహదారి పనులు ప్రారంభమైన సందర్భంగా గేట్‌ను మూసేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. 12నెలలపాటు ఈ పనులు కొనసాగుతాయని అటువైపు వెళ్లే వాహనదారులు దూపల్లి గేటు నుంచి ప్రయాణాలు కొనసాగించాలని వారు సూచించారు
పసుపు బోర్డు ఎక్కడుందో
ఎంపీ అర్వింద్ చెప్పాలి
నిజామాబాద్ సిటీ: జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుచేశామని గొప్పలు చెప్పుకుంటున్న ఎంపీ అర్వింద్ అసలు పసుపు బోర్డు ఎక్కడుంది? దాని విధివిధానాలు ఏమిటో చెప్పాలని నిజామాబాద్ మార్కెట్‌కమిటీ చైర్మ న్ ముప్ప గంగారెడ్డి ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో పసుపు రైతులు రోడ్డెక్కుతున్నారని అన్నారు. పసుపు రైతుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. నవోదయ విద్యాలయం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కృషితోనే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎంపీ అర్వింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులపై మాట్లాడేముందు బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
డీఎస్పీ కార్యాలయం తనిఖీ
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం ఎస్పీ రాజేశ్ చంద్ర సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. సబ్ డివిజన్‌లోని పోలీస్ స్టేషన్‌లకు సంబంధించిన అధికారులు, సి బ్బంది వివరాలను ఏఎస్పీ చైతన్యారెడ్డిని అడి గి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ తిరుపయ్య ఉన్నారు.

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు