సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

Published Tue, Apr 16 2024 1:05 AM

- - Sakshi

నిజామాబాద్‌ రూరల్‌: విద్యార్థులు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని 6వ టౌన్‌ ఎస్సై రమేష్‌ సూచించారు. మండలంలోని సారంగాపూర్‌ బీఈడీ కళాశాలలో సోమవారం ఆయన సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. తెలియని మొబైల్‌ లింకులను అనవసరంగా క్లిక్‌ చేయవద్దని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌న్‌ కాల్స్‌కు స్పందించవద్దన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు అకౌంట్‌ సంబంధించిన సమాచారం, సీవీవీ, ఓటీపీ లాంటి సమాచారాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఎవ్వరికి తెలపవద్దన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. కళాశాల కో–ఆర్డినేటర్‌ వన్నెల్‌దాస్‌ శ్రీనివాస్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ రవీందర్‌, అధ్యాపకులు పోలపల్లి, సువర్చల, పోలపల్లి శ్రీకాంత్‌, హరిత, నరేందర్‌, పోశెట్టి, నరసింహారెడ్డి, నుజ్రత్‌, ప్రసాద్‌, శశి పాల్గొన్నారు.

పుస్తకావిష్కరణ

నిజామాబాద్‌నాగారం: నగరంలోని మల్లు స్వరాజ్యం మెమోరియల్‌ ట్రస్ట్‌ భవనంలో సోమవారం జర్నలిస్టు ప్రభీర్‌ ప్రోకాయిస్త రచించిన ‘అలుపెరుగని పోరాటం’ పుస్తకాన్ని ప్రముఖ న్యాయవాది మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు గొర్రెపాటి మాధవరావు ఆవిష్కరించారు. నాటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నుంచి నేటి అప్రకటిత మోదీ ఎమర్జెన్సీ వరకు జరిగిన పరిణామాలను విశ్లేషిస్తూ పుస్తకాన్ని రాశారని వక్తలు పేర్కొన్నారు. ట్రస్ట్‌ కార్యదర్శి రామ్మోహన్‌రావు, రవీంద్రనాథ్‌సూరి, హుస్సేన్‌, ఈవీఎల్‌ నారాయణ, బన్సీలాల్‌ రాజేంద్ర, ప్రసాద్‌రావు, నూర్జహాన్‌, సిర్ప లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు దంత పరీక్షలు

నిజామాబాద్‌ సిటీ: నగరంలోని నాగారం ప్రభుత్వ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలో సోమవారం రోటరీ క్లబ్‌ జెమ్స్‌ నిజామాబాద్‌ ఆధ్వర్యంలో డెంటల్‌ క్యాంపు నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులకు వైద్యులు దంత పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. వైద్యుడు వినోద్‌ కుమార్‌ విద్యార్థులకు దంత సమస్యలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్‌సయ్యద్‌ జాయినాబ్‌, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ జేమ్స్‌ ప్రాజెక్ట్‌ చైర్మన్‌ కోటగిరి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

బాల్యవివాహాలను

అరికట్టేందుకు సహకరించాలి

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైత న్య కుమార్‌ సూచించారు. మండలంలోని కు లాస్‌పూర్‌ తండాలో సోమవారం జిల్లా బాలల పరిరక్షణ, పోలీస్‌శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బాల్య వివాహ నిరోధక చట్టం, గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టం, 1098 చైల్డ్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ప్రొజెక్టర్‌ ఏర్పాటు చేసి, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం చైతన్యకుమార్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎవరైనా బాల్యవివాహం చేస్తే వెంటనే పోలీసులకు, తమకు ఫోన్‌ చేయాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఏఎ స్సై రమేష్‌ కుమార్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ జకీరా, పంచాయతీ కార్యదర్శి చైతన్యకుమార్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కో–ఆర్డినేటర్‌ జ్యోత్స్న, అంగన్‌వాడీ టీచర్లు, పోలీస్‌, చైల్డ్‌ లైన్‌ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

మద్యం బాటిళ్ల స్వాధీనం

రుద్రూర్‌: వర్ని మండలం శ్యాంరావ్‌ తండాలో ని ఒక కిరాణ షాపులో అక్రమంగా నిల్వ ఉంచి న నాలుగు లీటర్ల మద్యం బాటిళ్లను సోమవా రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మ ద్యం విలువ రూ.4,785 ఉంటుందని వారు పే ర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్టు ఎస్సై కృష్ణకుమార్‌ తెలిపారు.

ఉపాధి పనుల పరిశీలన

బాల్కొండ: జలాల్‌పూర్‌లో ఉపాధి హామీ పనులను బాల్కొండ ఏపీవో ఇందిరా సోమవా రం పరిశీలించారు. కూలీల సంఖ్య పెంచాలని సిబ్బందికి సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. సిబ్బంది ధనుంజయ్‌, అనిల్‌ ఉన్నారు.

1/3

2/3

3/3

Advertisement
 
Advertisement