సామాన్యులు ఒకనెల కరెంటు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తే అపరాధ రుసుం వేసి బెదరగొట్టి వసూలు చేసే ట్రాన్స్‌కో అధికారులు ఆర్మూర్‌లో ఓ మాజీ ప్రజాప్రతినిధి రూ. కోట్లల్లో విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నా కిమ్మనకుండా గప్‌చుప్‌గా చూస్తూ ఉండిపోయారు. ఇదేం ధోరణి అంటూ సామాన్యులు విద్యుత్ శాఖపై ఆగ్రహంతో ఉన్నారు.
● ఓ ప్రజాప్రతినిధి వ్యాపార సముదాయంలో రూ. కోట్లల్లో విద్యుత్ బకాయిలు
● ఆవైపు కన్నెత్తి చూడని విద్యుత్‌శాఖ
● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
● విద్యుత్ శాఖలో వింతధోరణి