
కామారెడ్డి టౌన్: ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకటరమణారెడ్డి ఎస్పీ సింధూ శర్మను జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నూతనంగా ఎన్నికై న ఎమ్మెల్యేకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బీజేపీ కౌన్సిలర్ శ్రీకాంత్, నాయకులు తేలు శ్రీనివాస్, ఆకుల భరత్, నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఫోన్‌లో బెదిరిస్తున్న వారిపై ఫిర్యాదు
బోధన్‌టౌన్: అర్ధరాత్రి ఫోన్లు చేసి తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శనివారం అర్థరాత్రి 1 నుంచి తెల్లవారు జాము 4.56 వరకు దొడ్ల రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. అస్లెంబీ ఎన్నికల్లో తాము బీఆర్‌ఎస్‌కు మద్దతుగా పని చేశామనే కోపంతో తనను చంపేస్తానని బెదిరించినట్లు చెప్పారు. దొడ్ల రవీందర్‌రెడ్డి, అతని అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని పోలీ సులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
సిద్ధరామేశ్వర
ఆలయంలో పూజలు
రాజంపేట: మండల కేంద్రంలోని అయ్యప్ప భక్తులు భిక్కనూరు పరిధిలోని సిద్ధరామేశ్వర ఆలయాన్ని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
శబరిమాత
ఆశ్రమంలో భజనలు
తాడ్వాయి: మండల కేంద్రంలోని శబరి మాత ఆశ్రమంలో శనివారం రాత్రి భగవన్నామ సంకీర్తనలతో ప్రత్యేక భజనలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వేంకటేశ్వర, దత్తాత్రేయ, మార్కండేయ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. భజనకు మండలం నుంచే కాకుండా మెదక్, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.
వరి నాట్లు ప్రారంభం
నస్రుల్లాబాద్: జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు ప్రా రంభమయ్యాయి. మండల శివారులో రైతులు వరినాట్లను ప్రారంభించారు. ముందస్తు వరి నాట్లు వేస్తే పంట దిగుబడి పెరగడం, పెట్టుబ డి తగ్గుతుందని రైతులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పంట చివరన వచ్చే అకాల వర్షాలతో పంట నష్టం జరగదని అన్నారు.



