ఇద్దరు సీఐల బదిలీ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు సీఐల బదిలీ

Jun 15 2023 7:14 AM | Updated on Jun 15 2023 7:14 AM

- - Sakshi

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరే ట్‌ పరిధిలోని ఇద్దరు సీఐలు బదిలీ అయ్యా రు. మల్టీజోన్‌ పరిధిలో బుధవారం 16 మంది సీఐలను బదిలీ చేయగా ఇందులో నిజామాబాద్‌ నార్త్‌ సీఐ భూక్య నరహరిని సీసీఆర్‌బీలోకి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని తాండూర్‌ సీఐగా ఉన్న సతీశ్‌ను నిజామాబాద్‌ నార్త్‌ సీఐగా బ దిలీ చేశారు. సీసీఆర్‌బీలో ఉన్న సీఐ మోహన్‌కు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. పీసీఆర్‌, నిజామాబాద్‌లో పనిచేస్తున్న సీఐ రాజమౌళి సీసీఎస్‌ సిరిసిల్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అధిష్టానం ఆదేశిస్తే

‘రూరల్‌’ నుంచి పోటీ

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌ రెడ్డి

ఇందల్వాయి: కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేశ్‌ రెడ్డి ప్రకటించారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పంట విక్రయించి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ధాన్యం డబ్బులు రావడం లేదన్నారు. రైతుబంధు సకాలంలో ఇవ్వకపోవడం, ఇష్టరీతిన ధాన్యం కడ్తా తీయడం,పైపులైన్ల ద్వారా మూడెకరాలకు ఒక గేట్‌వాల్‌ బిగించి సాగు నీటిని అందిస్తానని ఇవ్వకపోవడం, మంచిప్ప ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేయడం స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలన్నారు. వెంటనే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, తలారి సుధా కర్‌, కరుణాకర్‌, మండల యూత్‌ అధ్యక్షుడు రాజు, గంగారాం, మల్లేశ్‌ పాల్గొన్నారు.

నిజామాబాద్‌ ‘రెడ్‌క్రాస్‌’కు

ఐఎస్‌వో గుర్తింపు

గవర్నర్‌ చేతుల మీదుగా

సర్టిఫికెట్‌ అందజేత

నిజామాబాద్‌ సిటీ: జిల్లా రెడ్‌ క్రాస్‌కు ఐఎస్‌వో గుర్తింపు వచ్చింది. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ చేతుల మీదుగా రెడ్‌క్రాస్‌ నిజామాబాద్‌ చైర్మన్‌ బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు తోట రాజశేఖర్‌లు సర్టిఫి కెట్‌ను అందుకున్నారు. గత శనివారం ఇండియన్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు నిజామాబాద్‌ రెడ్‌క్రాస్‌ కేంద్రానికి వచ్చి తనిఖీ చేసి సంస్థ వివరాలు, చేపడుతున్న కార్యక్రమాలు అలాగే కేంద్రం పరిశుభ్రత, రక్త సేకరణ నాణ్యత, పరిమాణాలపై ఐఎస్‌వో సరిఫికెట్‌ను జారీ చేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌, రెడ్‌క్రాస్‌ ప్రెసిడెంట్‌ తమిళిసై సౌందరాజన్‌ జిల్లా రెడ్‌క్రాస్‌ కార్యవర్గాన్ని ప్రశంసిస్తూ సర్టిఫికెట్‌ను అందజేశారు. అలాగే రెడ్‌క్రాస్‌లో ఎక్కువ సార్లు రక్త దానం చేసిన నిజామాబాద్‌ జిల్లా కోర్టు ఉద్యోగి నాగేందర్‌ను జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో కోశాధికారి కరిపె రవీందర్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రజలను

వంచించిన కేసీఆర్‌

బాల్కొండ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను వంచించాడని ప్రభుత్వ మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌ ఆరోపించారు. బుధవారం ముప్కాల్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ హాథ్‌సే హాథ్‌ జోడో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు చేపట్టే సంక్షేమ పథకాలను వివరించారు.

రూ.2 లక్షల రుణమాఫీ..

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అన్నారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ రూ.500 కే అందిస్తామన్నారు. పీసీసీ డెలిగేట్‌ క్యాతం గంగారెడ్డి, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు నీరడి భాగ్య, తదితరులు పాల్గొన్నారు.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement