లక్ష్మణచాంద: వరుణుడి కరుణ కోసం అన్నదాతలు నిత్యం నిరీక్షిస్తున్నారు. జూన్ ప్రారంభమై పక్షం రో జులు గడిచినా ఇప్పటివరకు ఒక్క భారీ వర్షం కురువకపోవడంతో దిగులు చెందుతున్నారు. ఈ రోజైనా వర్షం పడకపోతుందా.. అని రోజూ ఆకాశానికేసి ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 80శాతం మంది వ్య వసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. విత్తనా లు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులు వానాకా లం సాగుకు సమాయత్తమయ్యారు. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్నారు. బోర్లున్న రైతులు మాత్రం ఇప్పటికే మొక్కజొన్న, పత్తి, పసుపు విత్తనాలు వేశారు. ఎల్‌నినో ప్రభావంతో జూన్ ప్రారంభమై పక్షం రోజులు గడిచినా ఒక్క భారీ వర్షం పడకపోగా ఇంకా ఎండలు దంచి కొడుతూనే ఉన్నాయి.
జిల్లాలో వర్షపాతం ఇలా..
జిల్లాలో గతేడాది జూన్‌లో సాధారణ వర్షపాతం 49.1 మి.మీటర్లుగా కాగా, జూన్ 15వరకు 7.4 మి.మీటర్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈసారి జూన్‌లో సాధారణ వర్షపాతం 77.4 మి.మీ టర్లు కాగా, ఈ నెల 16వరకు 51.2 మి.మీటర్లుగా నమోదైందని పేర్కొన్నారు. దీంతో సాధారణ వర్షపాతం కంటే 34 మి.మీటర్లు తక్కువగా నమోదైనట్లు పేర్కొంటున్నారు.
జిల్లాలో పంటల సాగు వివరాలు
పత్తి 1.70 లక్షల ఎకరాలు
వరి 1.40 లక్షల ఎకరాలు
సోయా లక్ష ఎకరాలు
మొక్కజొన్న 20వేల ఎకరాలు
పసుపు 9వేల ఎకరాలు
ఇతర పంటలు వెయ్యి ఎకరాలు
మొత్తం సాగు విస్తీర్ణం 4.40లక్షల ఎకరాలు


