స్మరిద్దాం.. సాధిద్దాం | - | Sakshi
Sakshi News home page

స్మరిద్దాం.. సాధిద్దాం

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

● ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ‘ప్రజాపాలన’ ● ప్రభుత్వ పథకాలతో పేదలకు లబ్ధి ● సమష్టిగా జిల్లాను అభివృద్ధి చేద్దాం ● ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం ● ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు బుధవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2026 అమరవీరులకు నివాళులర్పిస్తున్న విప్‌ వీరేశం, కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, ఎస్పీ జానకీషర్మిల, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అప్పాల కావ్య, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

న్యూస్‌రీల్‌

జిల్లాలో 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1.08 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశామన్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా తొలిసారి 1.61 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో రూ.380 కోట్లు జమ చేశామన్నారు.

రైతు భరోసా పథకం కింద యాసంగి 2025–26 సీజన్‌లో 1.91 లక్షల మంది రైతులకు రూ.168.55 కోట్ల పెట్టుబడి అందించామన్నారు.

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 75,732 మంది కూలీలకు రూ.43.01 కోట్ల వేతనాలు చెల్లించినట్లు చెప్పారు. జిల్లాలో చేపట్టిన చర్యలకు ‘జల సంచయ్‌–జన్‌ భాగీదారి’ అవార్డు లభించడం అభినందనీయమన్నారు.

జిల్లాలో 400 జీపీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన రూ.43.22 కోట్లతో అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సీ్త్రశిశు సంక్షేమశాఖల ద్వారా రూ.లక్షల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.

నిర్మల్‌ మున్సిపాలిటీలో అమృత్‌ 2.0, టీయూఎఫ్‌ఐడీసీ నిధుల ద్వారా రూ.63 కోట్ల వ్యయంతో ధర్మసాగర్‌ చెరువు పునరుద్ధరణ, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

బాసర క్షేత్రాన్ని మాస్టర్‌ ప్లాన్‌ ద్వారా రూ.225 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.

గోదావరి పుష్కరాలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామన్నారు.

పోలీస్‌శాఖ ‘అరైవ్‌–అలైవ్‌’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. గాంజాగస్తీ, నారీశక్తి, శివంగి మహిళా కమాండో దళం, పోలీస్‌ అక్క తదితర కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. జిల్లా ఎస్పీ జానకీషర్మిల స్కోచ్‌ అవార్డును అందుకోవడం అభినందనీయమన్నారు. జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రజాప్రతినిధులందరికీ వేముల వీరేశం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నృత్యం

చేస్తున్న

విద్యార్థిని

నిర్మల్‌

కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకం ఆవిష్కరించి, జాతీయ గీతపాలన చేశారు. పలువురు పాఠశాలల విద్యార్థులకు ఈ సందర్భంగా కలెక్టర్‌ బహుమతులు పంచి, మిఠాయిలు అందించా రు. అందరికీ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తె లిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌(రెవె న్యూ) కిశోర్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

నిర్మల్‌: అమరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటం ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అమరుల స్మరిస్తూ, ఉద్యమకారులను గుర్తిస్తూ జి ల్లానూ సమష్టిగా అభివృద్ధి చేసుకుందామని పిలు పునిచ్చారు. కలెక్టరేట్‌లో తెలంగాణ ఆవిర్భావ దినో త్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీరేశం హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, ఎస్పీ జానకీషర్మిల తదితరులతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రగతి సందేశాన్ని చదివివినిపించారు.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక..

ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ఈదిశగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ద్వారా వివిధరంగాల్లో విశేష పురోగతి సాధించామని వీరేశం పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్మల్‌ జిల్లా గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందన్నారు.

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు..

ప్రభుత్వం ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద జిల్లాకు మొత్తం 9,292 గృహాలు కేటాయించగా, ఇప్పటివరకు 7,651 అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు. ఖానాపూర్‌, ముధోల్‌, నిర్మల్‌ నియోజకవర్గాల్లో 6,684 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా, 1,450 నిర్మాణం పూర్తిచేసుకున్నాయన్నారు. లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.142.79 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఈనెల 1న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లక్ష ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,091 గృహప్రవేశాలు అయ్యాయని పేర్కొన్నారు. రెండోదశలో ప్రతీ నియోజకవర్గానికి రెండువేల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా, పూరి గుడిసెల్లో నివసించే అర్హులైన పేద కుటుంబాలకు 1,500 ఇళ్లను ప్రాధాన్యంగా మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో ఇల్లు నిర్మించుకుని స్లాబ్‌ వేయలేకపోయిన 500 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.

మహాలక్ష్మి, గృహజ్యోతి..

మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 6.90 కోట్లకు పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. జిల్లాలో గృహజ్యోతి విద్యుత్‌ సబ్సిడీ పథకం కింద 1.35 లక్షలకుపైగా లబ్ధిదారులకు రూ.107.62 కోట్ల సబ్సిడీ అందించామన్నారు.

మహిళా సంఘాలకు

చెక్కు అందజేత

మహిళా సంఘాలకు మంజూరైన రూ.74.93 కోట్ల చెక్కును, ధాన్యం కొనుగోలు కేంద్రాల కమీషన్‌ రూ.3.94 కోట్ల చెక్కును అందించారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో నిర్మల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అప్పాల కావ్య, అడిషనల్‌ కలెక్టర్లు కిశోర్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, భైంసా సబ్‌కలెక్టర్‌ సంకేత్‌కుమార్‌, ఏఎస్పీలు ఉపేంద్రారెడ్డి, సాయికిరణ్‌, డీఎఫ్‌వో సుఖ్‌దేవ్‌ బోబడే, డీఆర్‌ఓ రాథోడ్‌ రమేశ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ గణేశ్‌చక్రవర్తి తదితరులతో కలిసి అల్పాహారం ఆరగించారు.

విద్య, వైద్యరంగాల్లో..

జిల్లాలోని 1,046 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1.34 లక్షల మంది విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందజేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి 742 బడుల్లో మధ్యాహ్న భోజనంతోపాటు బ్రేక్‌ఫాస్ట్‌ అందిస్తామన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో జిల్లా 98.96 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలువడం గర్వకారణమన్నారు. ఇక వైద్యరంగంలో జిల్లాలో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద 11 ప్రైవేటు, 6 ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా 1,015 శస్త్రచికిత్సలు నిర్వహించగా, రూ.30.47 కోట్ల చెల్లించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 4,962 ప్రసవాలు చేసినట్లు తెలిపారు.

వివిధ శాఖల ద్వారా...

Advertisement
 
Advertisement
Advertisement