పర్యావరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యావరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాలు, వర్షాకాలం సన్నద్ధత, గ్రామసభల నిర్వహణ, తదితర అంశాలపై హైదరాబాదు నుంచి డీజీపీ సీవీ.ఆనంద్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పర్యావరణ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. రానున్న వర్షాకాలం, వాతావరణ పరిస్థితులు, పంటల సాగు వంటి అనేక విషయాలను ఈ సభలలో రైతులకు వివరించాలన్నారు. ఆకస్మిక వరదలు, విపత్కర పరిస్థితులపై అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్‌ విభాగాలు పరస్పరం సమన్వయంతో ఉండాలన్నారు. అనంతరం తహసీల్దార్లతో కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించారు. గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. పెండింగ్‌ భూభారతి, సాదా బైనామా దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు. వీసీలో ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్‌, డీఆర్వో రాథోడ్‌ రమేశ్‌, ఎస్‌డీసీఎల్‌ఏ నాయక్వాడి జల కుమారి, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్‌, సీపీవో గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement