ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

● ఎమ్మెల్యే రామారావు పటేల్‌

కుంటాల: ప్రతీ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ అన్నారు. కుంటాల మండల పరిషత్‌ కార్యాలయంలో కుంటాల, నర్సాపూర్‌(జి) మండలాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు మంగళవారం పంపిణీ చేశారు. అందరి సహకారంతోనే నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ నిచ్చారు. మండలంలోని విఠాపూర్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో గృహ ప్రవేశాలు చేయించారు. పెంచికల్‌పాడ్‌ గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందించారు. ప్లాస్టిక్‌ నిర్మూలనకు కృషి చేయాలని, కుంటాల పంచాయతీ కార్యదర్శి రాజబాపు ఆధ్వర్యంలో తయారు చేసిన జ్యూట్‌ బ్యాగులను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు కమల్‌ సింగ్‌, శ్రీకాంత్‌, ఎంపీడీవో అల్లాడి వనజ, ఎంపీవో శోభన, సర్పంచ్‌లు జక్కుల గజేందర్‌, పెంటవార్‌ దశరథ్‌, చెన్న వసంత, లింగురాం పటేల్‌, హిమ్మత్‌ రావుపటేల్‌, రాజన్న, కట్ట రవి, రాణి, డీటీ కార్తీక్‌రెడ్డి, హౌసింగ్‌ ఏఈ శైలజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement