ఎస్పీ క్యాంపు కార్యాలయంలో.. | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ క్యాంపు కార్యాలయంలో..

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

నిర్మల్‌టౌన్‌:ఎస్పీ క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ జానకీషర్మిల జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ.. వారి సేవలను కొనియాడారు. అంతకుముందు జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్‌ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, జిల్లా పోలీస్‌ ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఆర్‌ఐ రామ్‌నిరంజన్‌రావు జాతీయ పతాకం ఎగుర వేశారు. వేడుకల్లో నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, పోలీసు సిబ్బంది, డీపీవో సిబ్బంది, హోం గార్డులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement