ఖానాపూర్‌లో కౌన్సిలర్‌ కిడ్నాప్‌ | - | Sakshi
Sakshi News home page

ఖానాపూర్‌లో కౌన్సిలర్‌ కిడ్నాప్‌

Apr 3 2026 7:38 AM | Updated on Apr 3 2026 7:38 AM

ఖానాపూర్‌: ఖానాపూర్‌ మున్సిపాల్టీ పరిధిలో ని 5వ వార్డు కౌన్సిలర్‌ మేసు పోసమ్మను కిడ్నాప్‌ చేశారని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈమేరకు ఖానాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 5వ వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున మేసు పోసమ్మ విజయం సాధించింది. ఈ నెల 4న మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల నేపథ్యంలో పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఒకే చోట ఉన్న సమయంలో కొందరు దుండగులు పోసమ్మను అపహరించారని ఆరోపించారు. ప్రజాతీర్పును గౌరవించకుండా ప్రజా ప్రతినిధులను కిడ్నాప్‌ చేయ డం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రజాప్రతిని ధిని అపహరించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేసు పోసమ్మను సురక్షితంగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఈ నెల 4న జరగనున్న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలరోజు ఖానాపూర్‌ పట్టణాన్ని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో అష్టదిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement