ముగిసిన సంగ్రామం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన సంగ్రామం

Dec 18 2025 7:27 AM | Updated on Dec 18 2025 7:27 AM

ముగిస

ముగిసిన సంగ్రామం

గురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

తుది ఓటూ.. హిట్టు.. ఓటెత్తిన ‘ముధోల్‌’.. మూడోవిడతలో 84.99 శాతం పోలింగ్‌ రెండు విడతలకన్నా ఎక్కువగా నమోదు విజయవంతంగా ముగిసిన ‘పంచాయతీ’

నిర్మల్‌

టాస్‌తో వరించిన విజయం

కుభీర్‌: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని బెల్గాంతండా సర్పంచ్‌ పదవికి పోటీపడిన ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. దీంతో టాస్‌తో ఒకరిని పదవి వరించింది. మొత్తం 570 ఓట్లు ఉండగా 510 పోలయ్యాయి. ఇద్దరు అభ్యర్థులకు 192 చొప్పున పోలయ్యాయి. రీకౌంటింగ్‌ తర్వాత కూడా సమానంగా ఓట్లు రావడంతో అధికారులు టాస్‌ వేశారు. జాదవ్‌ గోకుల్‌కు అదృష్టం వరించి సర్పంచ్‌ అయ్యారు.

జిల్లా అటవీశాఖ అధికారిగా సుశాంత్‌

నిర్మల్‌టౌన్‌: జిల్లా అటవీ శాఖ అధికారిగా సుశాంత్‌ సుఖ్‌దేవ్‌ బోబడే బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. 2022 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌ కు చెందిన సుశాంత్‌ కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ డివిజ నల్‌ అధికారిగా పనిచేసి పదోన్నతిపై నిర్మల్‌ జి ల్లా ఫారెస్ట్‌ అధికారిగా వచ్చారు. ఇప్ప టి వర కు డివిజనల్‌ అధికారి నాగినిభాను ఇన్‌చార్జి జిల్లా అధికారిగా పని చేశారు. సుశాంత్‌కు బా ధ్యతలు అప్పగించారు. అధికారులు, సిబ్బంది కొత్త డీఎఫ్‌వోకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు అటవీ భూముల ఆక్రమణలు అడ్డుకోవడంపై ప్రత్యేక దృష్టిసారిస్తానని సుశాంత్‌ వెల్ల డించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధి కారులు శివకుమార్‌, రామకృష్ణారావు, రాథోడ్‌ రమేశ్‌, శ్రీనివాసరావు, రాథోడ్‌ అవినాష్‌, రాజేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌: జిల్లాలో పంచాయతీ ఎన్నికల సంగ్రామం విజయవంతంగా ముగిసింది. మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఒకోవిడతకూ పోలింశాతం పెరిగింది. తుదివిడతలో భారీగా పోలింగ్‌ నమోదైంది. ఐదు మండలాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో 84.99 శాతం మంది ఓటు వేశారు. చలి వణికిస్తున్నా.. ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులుతీరారు. చివరి విడతలోనూ ఇద్దరిని ఒక్క ఓటు తేడాతో విజయం వరించింది. కోడలిపై అత్త మూడు ఓట్ల తేడాతో గెలిచింది. తుది విడత పోలింగ్‌ను కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, అడిషనల్‌ కలెక్టర్లు ఫైజాన్‌ అమ్మద్‌, కిశోర్‌కుమార్‌, ఎస్పీ జానకీషర్మిల, ఏఎస్పీ రాజేశ్‌మీనా, ప్రత్యేక పరిశీలకురాలు ఆయేషా మస్రత్‌ ఖానం, డీపీఓ తదితర ఉన్నతాధికారులు పోలింగ్‌, కౌంటింగ్‌ను పర్యవేక్షించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు.

మరింత పెరిగిన పోలింగ్‌..

మూడోవిడత బాసర, ముధోల్‌, తానూరు, భైంసా, కుభీర్‌ మండలాల్లో పోలింగ్‌ నిర్వహించారు. ముధోల్‌లో పోలింగ్‌ కేంద్రాలు ఉదయం నుంచే ఓటర్లతో కిక్కిరిసిపోయాయి. జిల్లా సరిహద్దు మండలమైన తానూరులో అత్యధికంగా 90.28 శాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం. ముధోల్‌ మండలంలో 82.73 శాతం నమోదైంది. తొలివిడతలో 80.42, రెండోవిడతలో 82.67 శాతం పోలింగ్‌ నమోద కాగా, తుదివిడతలో మరింత పెరిగి 84.99 శాతం నమోదైంది.

కదలొచ్చిన పల్లెలు...

మూడో విడతలో మొత్తం 1,45,048 మంది ఓటర్లు ఉండగా, 1,23,278 మంది ఓటేశారు. మొత్తం 21,770 మంది వివిధ కారణాలతో పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. వృద్ధులు, దివ్యాంగులూ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ విడతలో పురుషులు మొత్తం 70,338 మంది ఉండగా, 60,427 మంది ఓటేశారు. మహిళ ఓటర్లు 74,704 ఉండగా 62,849 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతరులు మొత్తం ఆరుగురు ఉండగా, ఇద్దరు మాత్రమే ఓటేశారు.

‘పంచాయతీ’ విజయవంతం..

జిల్లాలో మూడువిడతల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఈనెల 11, 14, 17 తేదీల్లో పోలింగ్‌ జరిగింది. ఖానాపూర్‌ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, నిర్మల్‌లోని రెండు మండలాలు తొలివిడతలో పూర్తయ్యాయి. రెండో విడతలో నిర్మల్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, ముధోల్‌లోని రెండు మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. ముధోల్‌లోని ఐదుమండలాల్లో మూడోవిడత పోలింగ్‌ విజయవంతంగా పూర్తిచేశారు.

మూడోవిడత పోలింగ్‌ వివరాలు..

మండలం మొత్తం పోలైన ఓట్లు మొత్తం పోలైన ఓట్లు మొత్తం పోలైనఓట్లు పోలింగ్‌

పురుషులు మహిళలు ఇతరులు శాతం

బాసర 6,892 5,730 7,437 6,145 01 –– 87

భైంసా 16,320 13,654 17,648 14,846 02 01 83.90

కుభీర్‌ 18,928 16,633 19,864 16,029 01 01 84.20

ముధోల్‌ 13,257 10,862 14,306 11,942 02 –– 82.73

తానూరు 14,941 13,548 15,449 13,887 –– –– 90.28

మొత్తం 70,338 60,427 74,704 62,849 06 02 84.99

ముగిసిన సంగ్రామం1
1/5

ముగిసిన సంగ్రామం

ముగిసిన సంగ్రామం2
2/5

ముగిసిన సంగ్రామం

ముగిసిన సంగ్రామం3
3/5

ముగిసిన సంగ్రామం

ముగిసిన సంగ్రామం4
4/5

ముగిసిన సంగ్రామం

ముగిసిన సంగ్రామం5
5/5

ముగిసిన సంగ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement