పెన్షనర్ల హక్కులు కాపాడాలి
నిర్మల్‌చైన్‌గేట్: పెన్షన్ల హక్కులను కాపాడాలని జాతీయ పెన్షన్ల సంఘం జిల్లా కార్యదర్శి ఎంసీ లింగన్న అన్నారు. నిర్మల్‌లోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం జాతీయ పెన్షనర్ల దినోత్సవం నిర్వహించారు. ఎంసీ.లింగన్న మాట్లాడుతూ ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రం తెలంగాణనే అన్నారు. 2024 తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లందరికీ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జి రాధిక, సంఘం ట్రెజరర్ సరోజన, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజేందర్, పెన్షనర్లు పాల్గొన్నారు.


