ఆలయ అభివృద్ధికి రూ.2.50 లక్షల విరాళం
● మతసామరస్యం చాటుకున్న గ్రంథాలయ చైర్మన్
నిర్మల్‌టౌన్: జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమన్ అలీ మతసామరస్యం చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.2.50 లక్షలు విరాళంగా అందించారు. పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు గ్రంథాలయ చైర్మన్‌ను సత్కరించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్, సెక్రెటరీ ముప్పిడి రాకేశ్, కోశాధికారి సుద్దుల సత్యనారాయణ, మను సంఘం అధ్యక్షుడు జగదీష్, కోటగిరి గోపి, రవి, గణేశ్, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు నరేశ్, సజ్జనపు గణేశ్, సాగర్, ముత్యం, పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.


