అధికారుల నిర్లక్ష్యంతో చేలల్లోకి నీరు
భైంసాటౌన్: పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజె క్టు అధికారుల నిర్లక్ష్యంతో తాము పంట నష్టపోయామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రాజెక్టు ఏఈ రాహుల్‌ను నిలదీశారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు కాలు వకు మూడుచోట్ల మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా కాలువలోని నీరు బయట కు వెళ్లేలా గండి కొట్టించారు. దీంతో ఈ నీరంతా పక్కనే ఉన్న పంట చేలల్లోకి చేరింది. ఫలి తంగా చేలల్లో నీరు చేరి పంట నష్టపోయామని రైతులు అధికారులను నిలదీశారు. తమకు కనీసం సమాచారం లేకుండా కాలువకు గండి పెట్టారని పేర్కొన్నారు. అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.


