మూడోవిడత ర్యాండమైజేషన్ పూర్తి
నిర్మల్‌చైన్‌గేట్: మూడో విడతలో గ్రామ పంచా యతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారుల ర్యాండమైజేషన్ మండలాల వారీగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం పూర్తి చేశా రు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు సరిపడా ఆర్వో, ఓఆర్వోల ను నియమించనున్నట్లు తెలిపారు. 20 శాతం అదనంగా అధికారులను నియమించుకున్న ట్లు పేర్కొన్నారు. ర్యాండమైజేషన్‌లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న, జెడ్పీ సీఈవో శంకర్, అధికారులు పాల్గొన్నారు.


