ఏరియాస్పత్రిలో కార్మికుల ఆందోళన
భైంసాటౌన్: పట్టణంలోని ఏరియాస్పత్రిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు గురువారం ఆందోళన చేపట్టారు. కేఎస్ ఎంటర్ ప్రైజెస్ అనే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న దాదాపు 50 మంది కార్మికులకు ప్రతినెలా వేతనాల్లో కోత విధిస్తున్నారని వా రు ఆరోపించారు. నెలకు రూ.15,500 వేత నం చెల్లించాల్సి ఉండగా, పీఎఫ్ పోను రూ.10,500 చెల్లించాలన్నారు. కానీ, ఇటీవల మూడునెలల వేతనం రూ.26 వేలు మాత్రమే జమ చేశారని, రూ.10,500 చొప్పున రూ.31,500 జమ కావాల్సి ఉండగా, కోత పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.


