మాజీ సీఎం రోశయ్యకు నివాళి
నిర్మల్‌చైన్‌గేట్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం అధికారికంగా నిర్వహించారు. అదనపు కలెక్ట ర్ కిశోర్‌కుమార్, అధికారులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడు తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి గా, మంత్రిగా ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో బీసీ, ఎస్టీ, మై నారిటీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, అంబాజీ, మోహన్‌సింగ్, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మేనేజర్ నరసింహా రెడ్డి, హార్టికల్చర్ అధికారి రమణ, ఎల్డీఎం. రామ్‌గోపాల్, కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు సూర్యారావు తదతరులు పాల్గొన్నారు.


