పోలీసింగ్‌లో ఆదర్శంగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

పోలీసింగ్‌లో ఆదర్శంగా నిలవాలి

Dec 5 2025 6:51 AM | Updated on Dec 5 2025 6:51 AM

పోలీసింగ్‌లో ఆదర్శంగా నిలవాలి

పోలీసింగ్‌లో ఆదర్శంగా నిలవాలి

● డీజీపీ శివధర్‌రెడ్డి ● పోలీస్‌ నివాస భవనాలు ప్రారంభం

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ పోలీసింగ్‌ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని, శాతిభద్రతల పరిరక్షణకు మరింత నిబ ద్ధతతో పని చేయాలని డీజీపీ శివధర్‌రెడ్డి సూచించా రు. జిల్లా కేంద్రంలోని ఎల్లపల్లి వద్ద పోలీస్‌ అధికా రులు, సిబ్బంది కోసం నిర్మించిన భవనాలను స్థాని క ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో కలిసి గురువా రం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ క్యాంప్‌ కా ర్యాలయ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నూతనంగా నిర్మించిన ఈ ఆధునిక భవనాలు పోలీ స్‌ సిబ్బందికి మెరుగైన పనిస్థలం, నివాస వాతావరణం అందిస్తాయన్నారు. పోలీసులు కూడా సేవల నాణ్యతను పెంచేందుకు దోహదపడతాయని తెలి పారు. కార్యక్రమంలో ఐజీపీ(పీఅండ్‌ఎల్‌)ఎండీ రమేశ్‌, కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎస్పీ జానకీషర్మి ల, అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌అహ్మద్‌ , అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, నిర్మల్‌ ఏఎస్పీ రాజేశ్‌మీనా, పోలీస్‌ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement