జాబిలమ్మ.. చెంతకు చేరెనమ్మ
జిల్లాలో ఆకాశంలో అరుదైన దృశ్యం గురువారం ఆవిష్కృతమైంది. నింగిలో జాబిలమ్మ.. జిల్లావాసులను కనువిందు చేసింది. 2025 చివరి పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6:55 గంటల ప్రాంతంలో చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా వచ్చాడు. సాధారణ పౌర్ణమి చంద్రునితో పోలిస్తే 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా, సుమారు 14 శాతం పెద్దగా కనిపించినట్లు ఖగోళనిపుణులు తెలిపారు. చెంతకు వచ్చిన చందమామను.. జిల్లావాసులు ఇళ్ల డాబాలు ఎక్కి వీక్షించారు. సెల్‌ఫోన్లలో బంధించారు. జాబిలమ్మను అందుకుంటున్నట్లు సెల్ఫీలు, ఫొటోలు దిగారు. – నిర్మల్‌ఖిల్లా


