ఘనంగా దత్త జయంతి
నిర్మల్‌టౌన్: దత్త జయంతి వేడుకలు గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా దత్తాత్రేయ, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ పట్టణ శివారులోని గండి రామన్న క్షేత్రం ఆవరణలోని సాయిబాబా, దత్తాత్రే య ఆలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. వందల మంది భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. 48 గంటలుగా కొనసాగిన సాయినామ సంకీర్తన మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. మధ్యాహ్న హారతి అనంతరం మహా అన్నదాన కార్యక్ర మం నిర్వహించారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక దత్తాత్రేయనగర్‌లోని దత్తాత్రేయ ఆలయంలో, మంజులాపూర్ సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భూమయ్య, చైర్మన్ బురాజ్, సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్‌రెడ్డి, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.


