భద్రత.. బాధ్యత
న్యూస్‌రీల్
ఎస్పీ జానకీషర్మిల
రోడ్డు ప్రమాదాలపై పోలీసుల ఫోకస్! డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమాలు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు మైనర్ డ్రైవింగ్‌పై కొరడా
నిర్మల్
రైల్వే జీఎంను కలిసిన ఎమ్మెల్యే
బాసర: సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాస్తావ్‌ను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మంగళవారం హైదరాబాద్‌లో కలిశారు. నయగావ్ అండర్ బ్రిడ్జి నిర్మాణం, బాసరలో రైళ్ల హాల్టింగ్ కోసం విన్నవించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారని, అన్ని రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని కోరారు.
నిర్మల్‌టౌన్: జిల్లాలో ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. దీంతో పోలీసులు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తున్నారు. ఏటా వివిధ ఘటనల్లో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, డ్రైవర్లలో అప్రమత్తత పెంచడమే ప్ర ధాన లక్ష్యంగా అరైవ్ అలైవ్ – ఏ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎస్పీ జానకీషర్మిల పర్యవేక్షణలో బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, రాత్రి గస్తీలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ శిక్షణ, మద్యం నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
డిఫెన్సివ్ డ్రైవింగ్..
డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది డ్రైవింగ్ నైపుణ్యంతోపాటు భవిష్యత్తులో జరిగే ప్రమాదాన్ని ముందుగానే ఊహించగల సామర్థ్యాన్ని పెంపొందించే పద్ధతి. రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలు, పాదాచారులు, సంకేతాలపై నిరంతర దృష్టి ఉంచడం దీనిలో భాగం. ఈ విధానం డ్రైవర్ మాత్రమే కాదు, సహ ప్రయాణికుల ప్రాణాలను కూడా కాపాడగలదని అధికారులు పేర్కొంటున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై చర్యలు..
రాత్రి వేళల్లో మద్యం సేవించి వాహనాలు నడపడంతో అనేక ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఈ ధో రణిని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక గస్తీలు, చె క్‌పోస్టులు ఏర్పాటు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వారిపై కేసులు, వాహనాల జప్తు, లైసెన్స్ సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ కఠి న చర్యల వల్ల ప్రమాదాల రేటు కొంత తగ్గిందని అ ధికారులు చెబుతున్నారు. జిల్లాలో మైనర్ డ్రైవింగ్ కేసులు పెరగడంతో పోలీసులు మరింత కఠిన వైఖ రి అవలంబిస్తున్నారు. వాహనం నడుపుతున్న చి న్నారులను పట్టుకుని వాహనం సీజ్ చేసి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అవసరమైతే కేసులు నమోదు చేస్తున్నారు. చిన్నారుల ప్రాణాలు ప్ర మాదంలో పడనీయకండి అనే సందేశంతో పోలీసు శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
బ్లాక్ స్పాట్స్ గుర్తింపు..
జిల్లాలో మొత్తం 27 ప్రమాద ప్రాధాన్య ప్రాంతాలు గుర్తించబడ్డాయి. వీటిలో సిగ్నల్ సూచనలు ఏర్పాటు చేయడం, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఉంచడం, లైట్ రిఫ్లెక్టర్లు అమర్చడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్డు భద్రత కేవలం పోలీసు బాధ్యత కాదు.. ప్రతీ డ్రైవర్ జాగ్రత్తగా వ్యవహరించడం అతని డిఫెన్సీవ్ డ్రైవింగ్ భావనను అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా అవగాహన
కార్యక్రమాలు..
డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ డిఫెన్సివ్ డ్రైవింగ్ తప్పనిసరిగా పాటించాలి. తప్పుదారిలో వచ్చే డ్రైవింగ్ వాహనాలను ముందుగానే గుర్తించాలి. మొబైల్ ఉపయోగించే డ్రైవర్లకు దూరంగా ఉండాలి. సిగ్నల్ జంపు చేసే వాహనాలను గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు వెళ్లే వాహనాలకు దూరంగా ఉండాలి. – జానకీషర్మిల, ఎస్పీ
డిజిటల్ అరెస్ట్ కాల్స్‌ను నమ్మొద్దు
నిర్మల్ రూరల్: డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తే భయపడొద్దని, ఆ కాల్స్ నమ్మొద్దని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. ఇటీవలి కాలంలో సైబర్ మోసగాళ్లు పోలీసు లేదా ఇతర అధికారుల పేర్లు చెప్పి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేదని, వీడియో కాల్, వాట్సప్, లేదా ఫోన్ ద్వారా ఎవరైనా బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత, బ్యాంక్, ఓటీపీ, యూపీఐ, ఆధార్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఎవరైనా డబ్బులు అడిగితే కాల్ కట్‌చేసి, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 నంబర్‌కు కాల్ లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
నాలుగేళ్లలో జిల్లాలో ప్రమాదాల గణాంకాలు..
సంవత్సరం ప్రమాదాల మరణాలు గాయాలు
సంఖ్య
2022 260 139 279
2023 214 93 202
2024 390 133 412
2025
(నవంబర్ 15 వరకు) 522 139 612
భద్రత.. బాధ్యత
భద్రత.. బాధ్యత


