మల్లా ఏమొస్తదో..!?
వచ్చేనెలలో పంచాయతీ ఎన్నికలు పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు పార్టీపరంగా 42 శాతం ఇస్తామంటున్న కాంగ్రెస్
పురస్కారం అందుకున్న కలెక్టర్
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ జిల్లాకు జల పురస్కారాల్లో భాగంగా ‘‘జలసంచాయ్–జన్ భాగీదారి’’ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్.పాటిల్ చేతుల మీదుగా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం పురస్కారం స్వీకరించారు. ఇందుకు కృషిచేసిన అధికారులకు, సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో విజయలక్ష్మి ఉన్నారు.
ఈ పద్ధతులు పాటిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు చెబుతున్నారు.
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గుతాయి. చలి ప్రభావం కొనసాగుతుంది. రాత్రి మంచు ఎక్కువగా కురుస్తుంది.
నిర్మల్: పాలకవర్గాలు లేక గాడితప్పుతున్న పంచాయతీలకు మరో నెల రోజుల్లో పునరుజ్జీవం రానుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపడంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. జిల్లా అధికారులు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఎన్నికలు 50 శాతం రిజర్వేషన్ విధానంతో నిర్వహించనున్నారు. అయితే, కాంగ్రెస్ మాత్రం 42 శాతం బీసీ రిజర్వేషన్లు పార్టీపరంగా ఇస్తామని చెబుతోంది. ఈ ప్రకటనతో గ్రామాల్లో తిరిగి రిజర్వేషన్ లెక్కలపై చర్చలు మొదలయ్యాయి. ఇటీవల బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలవుతాయనే ఊహల్లో ఉన్న నాయకుల్లో మళ్లీ పాత విధానంతో నైరాశ్యం నెలకొంది.
కోర్టు తీర్పుల ప్రభావం
రెండు నెలల క్రితం ప్రభుత్వం బీసీలకు అదనపు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించగా, మొత్తం శాతం 50 దాటిపోవడంతో కోర్టులు వాటిపై స్టేవిధించాయి. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల గడువు మార్చి వరకే ఉండటంతో, ముందుగా పంచాయతీ ఎన్నికలు ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బీసీలకు 24 శాతం మేర మాత్రమే రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి.
జనరల్ స్థానాలపై ఆశలు
జిల్లాలోని 18 మండలాల్లో 400 గ్రామ పంచాయతీలకు డిసెంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల ప్రకారం బీసీలకు 42 శాతం అవకాశాలు ఇవ్వాలనుకుంటుండగా, కోర్టు ఆంక్షల కారణంగా ఆ ప్రయత్నం ఆగిపోయింది. అయితే పార్టీ అంతర్గతంగా బీసీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతోంది. అదే సమయంలో జనరల్ స్థానాలపై ఆశలు పెంచుకున్న ఓసీ, బీసీయేతర వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మారుతున్న లెక్కలు..
పాత రిజర్వేషన్ విధానం అమలవుతుండడంతో, రెండునెలల క్రితం చేసిన లెక్కలన్నీ మారబోతున్నాయి. సెప్టెంబర్‌లో ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్‌లను కేటాయించిన పంచాయతీ మ్యాపులు ఇప్పుడు మారనున్నాయి. ఐదేళ్ల క్రితం ఉన్న రిజర్వేషన్‌లే కొనసాగుతాయా, లేక కొత్త లెక్కలతో మార్పులు వస్తాయా అన్న చర్చ పల్లెల్లో మొదలైంది.
ఆదేశాలు రాగానే..
సర్పంచ్ ఎన్నికల విధులు, రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పులకు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ఆదేశాలు అందలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు అందగానే పంచాయతీ ఎన్ని కల పనులను చేపడతాం.
– శ్రీనివాస్, డీపీవో
తీసుకోవాల్సిన జాగ్రత్తలు


