చిన్నారులకూ ‘అపార్’
లక్ష్మణచాంద: ఒక దేశం–ఒక విద్యార్థి ఐడి అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అపార్ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌ ంట్ రిజిస్ట్రీ) అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు సంవత్సరాల నుంచి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అపార్ నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్యను అభ్యసించే స్థాయి వరకు అన్నిరకాల సర్టిఫికెట్లను ఇందులో భద్రపరుచుకునే అవకా శం ఉంది. ఈ సంవత్సరం నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరిన విద్యార్థులకు కూడా అపార్
న మోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని 931 అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.
జిల్లాలో 60.49 శాతం పూర్తి
జిల్లా వ్యాప్తంగా మొత్తం 931 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో ఐదేళ్లలోపు చిన్నారులు 18,991 మంది ఉన్నారు. ఇందులో 13,390 మంది ఆధార్ కార్డులు కలిగి ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు 11,487 మంది చిన్నారులకు 60.49 శాతం అపార్ నమోదు ప్రక్రియ పూర్తి చేసినట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. ఇందులో ఆధార్ కార్డు కలిగి ఉండి ఇప్పటి వరకూ అపార్ నమోదుకాని చిన్నారులు కేవలం 1,903 మంది ఉండగా మూడేళ్లలోపు వారిలో ఇంకా 7,504 మందికి అపార్ నమోదు చేయాల్సి ఉందని ఐసీడీఎస్ అధికారులు పేర్కొంటున్నారు.
కారణాలు అనేకం...
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అపార్ నమోదు చేస్తున్న సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంగన్‌వాడీ టీచర్లు, ఐసీడీఎస్ అధికారులు అంటున్నారు.
తల్లిదండ్రులు సహకరించాలి
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అపార్ నమోదు చేపడుతున్నాం. జిల్లా వ్యాప్తంగా 18991 మంది చిన్నారులు ఉండగా ఇందులో 13,390 మంది ఆధార్‌కార్డు కలిగి ఉన్నారు. ఇప్పటి వరకు 11,487 మంది అపార్ నమోదు పూర్తి అయ్యింది. మిగిలిన 7,504 మందికి పూర్తి చేసేందుకు తల్లిదండ్రులు సహకరించాలి.
– సరిత, సీడీపీవో, నిర్మల్
జిల్లా వివరాలు
అంగన్‌వాడీ కేంద్రాలు 931
చిన్నారులు 18,991
ఆధార్ కలిగి ఉన్నవారు 13,390
అపార్ పూర్తయిన వారు 11,487
నమోదు చేయాల్సిన వారు 7,504


