ప్రతీ రక్తపు బొట్టు ప్రాణాన్ని కాపాడుతుంది | - | Sakshi
Sakshi News home page

ప్రతీ రక్తపు బొట్టు ప్రాణాన్ని కాపాడుతుంది

Oct 28 2025 8:38 AM | Updated on Oct 28 2025 8:38 AM

ప్రతీ రక్తపు బొట్టు ప్రాణాన్ని కాపాడుతుంది

ప్రతీ రక్తపు బొట్టు ప్రాణాన్ని కాపాడుతుంది

● ఎస్పీ జానకీ షర్మిల

నిర్మల్‌టౌన్‌: ప్రతీ రక్తపుబొట్టు ఒక ప్రాణాన్ని కాపాడుతుందని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. సోమవారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్‌ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ, ఏఎస్పీలు అవినాష్‌ కుమార్‌, రాజేశ్‌ మీనాతో పాటు 350 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రక్తదాతలు నిజమైన దేవుళ్లు అని అన్నారు. ప్రాణప్రాయస్థితిలో ఉన్నవారికి రక్తదానం చేయడం అంటే.. కొత్త జీవితం ఇవ్వడమే అన్నారు. అపోహలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement