మొలకలతో ఆరోగ్యం
పెసర్లు, శనగలు, పల్లీలు, తదితర తృణధాన్యాలు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
ఆత్మవిశ్వాసానికి మూలం
గ్రంథాలయాలు చదువుకే కాదు, ఆత్మవిశ్వాసానికి మూలం. గ్రంథాలయంలో ఉన్న ప్రశాంత వాతావరణం, ఒకే లక్ష్యంతో కష్టపడుతున్న ఇతర అభ్యర్థుల స్ఫూర్తి మాకు ఉత్సాహాన్నిచ్చింది. రోజువారీ సమయపాలన, పరీక్షల ప్రాక్టీస్, పుస్తకాల లభ్యత ఇవన్నీ మా విజయానికి కారణమయ్యాయి.
– ప్రకాశ్, పోలీస్ కానిస్టేబుల్ అండ్ గ్రూప్–4 విజేత, గోపాల్‌పేట్, సారంగపూర్
చక్కని మార్గనిర్దేశనం
పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మాలాంటి నిరుద్యోగ యువతకు గ్రంథాలయాలు చక్కని మార్గదర్శనం చేస్తున్నాయి. ఉచిత పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు కూర్చుని చదివేందుకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడే చదివి వార్డ్ ఆఫీసర్, గ్రూప్–2లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించా.
– కే.రమేశ్, గ్రూప్–2 విజేత, ఖానాపూర్
ఇక్కడే చదివి..
ఇక్కడే కొలువులు..
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాలు చక్కని అవకాశం కల్పించాయి. జిల్లా వాసులైన మేము ఇక్కడే చదివి ఇక్కడే కొలువులు సాధించడం మరిచిపోలేని అనుభూతి. ఇందులో గ్రంథాలయాల పాత్ర అత్యంత కీలకం.
– లిఖిత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, సౌజన్య, ఎన్పీడీసీఎల్ ఏఈ
మొలకలతో ఆరోగ్యం


