గజ్జలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
కుంటాల: కుంటాల ఇలవేల్పు గజ్జలమ్మ, ము త్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. గజ్జలమ్మ ప ల్లకి సేవలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, ధర్మాబాద్, బోకర్, తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. బోనా లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అడెల్లిలో భక్తుల సందడి
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజమాబాద్, వరంగల్, కరీంనగర్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్, ఈవో భూమయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు.
మన్ కీ బాత్ వీక్షించిన ‘ఏలేటి’
నిర్మల్‌చైన్‌గేట్/ఖానాపూర్: ప్రధాని నరేంద్రమోదీ 127వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఖానాపూర్‌లో బీజేపీ నాయకులు ఆదివారం వీక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, పిట్టల భూమన్న, జెట్టి చిన్న రాజన్న, పన్నెల సురేశ్, పంజాల శివ, భీమన్న, నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.
స్వదేశానికి జోర్డాన్ బాధితులు
కుంటాల/సోన్: జోర్డాన్‌లోని వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేందుకు తెలంగాణ ప్రాంతం నుంచి 12 మంది కార్మికులు ఉపాధి నిమిత్తం వలస వెళ్లారు. అక్కడ తాము పడుతున్న కష్టాలను వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వారిలో నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ముఖిమ్, సోన్ మండలంలోని కూచన్‌పెల్లికి చెందిన మెట్టు ముత్యం ఉన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు కూలీలకు వేసిన జరిమానా చెల్లించి, విమాన ప్రయాణ చార్జీలు భరించి క్షేమంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకున్నారు. 15 నెలల పాటు ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆదివారం ముఖిమ్, ముత్యం ఇంటికి రాగానే సంతోషపడ్డారు.
గజ్జలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
గజ్జలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
గజ్జలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
గజ్జలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ


