నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Oct 27 2025 9:04 AM | Updated on Oct 27 2025 9:04 AM

నిర్మల్‌

నిర్మల్‌

– 8లోu సోమవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

కొనుగోలు కేంద్రాలపై స్పష్టత కరువు పాదయాత్ర చేసినా పట్టింపేది? గత్యంతరం లేక వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు కమీషన్‌ పేరిట దోచుకుంటున్న వైనం

కేవలం 11 ప్రభుత్వ పాఠశాలల్లోనే అమలు సరిపడా కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు మరిన్ని స్కూళ్లలో ప్రారంభించాలని విద్యార్థుల వేడుకోలు

భైంసా/భైంసారూరల్‌ : జిల్లాలో నెల రోజుల క్రితం నుంచి సోయా కోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయించి పంటను విక్రయిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలన్న డిమాండ్‌తో ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో బాసర నుంచి పాదయాత్ర ప్రారంభించారు. భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీర సంకేత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రైతుల ఇబ్బందులను గుర్తించిన నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముధోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌ అక్టోబర్‌ 14న జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును సోయా దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు.

ఇప్పటికీ కొనుగోళ్లు లేవు...

సోయా సాగు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాలు కురుస్తునే ఉన్నాయి. పంట కోసి కల్లాల్లో ఆరబోసినా వర్షం ఇబ్బందులు తప్పడంలేదు. ఇటీవల వారం రోజులుగా జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారుల్లో స్పష్టత కరువైంది. కోసిన పంట ఇళ్లలో నిల్వ చేసుకోలేక, కల్లాల్లో ఆరబెట్టలేక రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ నెల 31 నుంచి సోయా కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇటువైపు మహారాష్ట్రలోనూ ఈ నెల 30 నుంచి సోయా కొనుగోళ్లు ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రకటించారు. కానీ మన నిర్మల్‌ జిల్లాలో మాత్రం కొనుగోళ్లపై స్పష్టత రావడం లేదు.

ప్రైవేటు వ్యాపారులకే కలిసివస్తోంది

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యం ప్రైవేటు వ్యాపారులకే కలిసి వస్తోంది. సోయా క్వింటాకు ప్రభుత్వం రూ.5,328 మద్దతు ధర ప్రకటించింది. కానీ ప్రైవేటు వ్యాపారులు రూ.3,900 నుంచి రూ.4,300 మాత్రమే చెల్లిస్తున్నారు. అంతేకాకుండా అదనంగా కమీషన్‌ చార్జీలు, చాట వాల చార్జీలతో రైతులను దోచుకుంటున్నారు. ప్రైవేటు వ్యాపారులే రైతులు పండించిన సోయా పంటను కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైతే రైతుల పేరిట వ్యాపారులు కొనుగోలు చేసిన సోయాలే విక్రయించేందుకు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రూ.వెయ్యి వరకు ధర కలిసివస్తుందని ఆలోచిస్తున్న వ్యాపారులు రైతుల పట్టాపాసు పుస్తకాలు తీసుకుని పంట విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యంతో తక్కువ ధరకు కొనడం, ఎక్కువ ధరకు ప్రభుత్వానికి విక్రయించడం మధ్య దళారులు ప్రైవేటు వ్యాపారులకే ఏటా కలిసి వస్తోంది.

భైంసా మార్కెట్‌కు విక్రయానికి తీసుకువచ్చిన సోయాలు

జిల్లా సమాచారం

ప్రభుత్వ పాఠశాలలు : 830

విద్యార్థులు : 67,790

ఏఐ విద్యా భోధన అమలవుతున్న

పాఠశాలలు: 11

అన్నదాత అరిగోస

జిల్లా వివరాలు

నియోజకవర్గాలు : ఖానాపూర్‌, నిర్మల్‌, ముధోల్‌

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు : ఖానాపూర్‌, నిర్మల్‌, సారంగపూర్‌, భైంసా, కుభీర్‌

జిల్లాలో సోయా సాగు : 1.05 లక్షల ఎకరాలు

రైతులు : 72,300

ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు : రూ.5,328

ప్రైవేటులో : రూ.3,900 నుంచి రూ.4,300

ప్రభుత్వానికి నివేదించాం

జిల్లాలో సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. జిల్లా వ్యాప్తంగా సాగైన పంట, దిగుబడి వివరాలు సేకరించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే జిల్లా ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.

– ప్రవీణ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ డీఎం, నిర్మల్‌

సమయం లేక అమ్ముకుంటున్నారు...

వేసవి సాగు కోసం భూములను సిద్ధం చేసేందుకు రైతులు పంట చేలలోనే ఉంటున్నారు. వర్షాకాలంలో పండించిన సోయా నిల్వలు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి వచ్చిన డబ్బులతో పంట భూములను సిద్ధం చేస్తున్నారు. రబీ సీజన్‌లో జొన్న, మొక్కజొన్న, శనగ పంటలు సాగుచేసే ఆలోచనలో ఉన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక వేసవి పంటల సాగు కోసం కాలాన్ని వృధా చేసుకోలేక వచ్చిన పంటను ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. జరుగుతున్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో గుర్తిస్తున్న అధికారులు ప్రభుత్వానికి వివరించి కొనుగోలు కేంద్రాలు తెరవడంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ జిల్లాలోని సోయా రైతులు నష్టపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement