ఏఐ బోధనకు అడ్డంకులు!
లక్ష్మణచాంద: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మార్చి 15న జిల్లాలోని ఐదు ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత విద్యను ప్రారంభించింది. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో కంప్యూటర్ ద్వారా విద్యను అందించాలని సంకల్పించింది. ఈ విద్యా సంవత్సరం మరో 14 పాఠశాలల్లో ప్రారంభించారు. 8 పాఠశాలలకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో కేవలం 6 పాఠశాలల్లోనే అమలవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం 11 పాఠశాలల్లో ఏఐ ఆధారిత విద్యాబోధన జరుగుతోందని జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
లక్ష్యం ఇదే....
ప్రాథమిక పాఠశాల స్థాయిలో విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు, పఠనా సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఏఐ విద్య దోహదపడుతుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. 1, 2 తరగతుల వి ద్యార్థులకు గణితం, 3, 4, 5 తరగతుల విద్యార్థుల కు గణితంతో పాటు, తెలుగు,ఆంగ్లం సులువుగా నే ర్పవచ్చని ఉపాధ్యాయులుపేర్కొంటున్నారు. వీటి నికంప్యూటర్‌లలో ఇన్‌స్టాల్ చేసిబోధన చేస్తున్నారు.
అన్ని పాఠశాలలో అమలు చేస్తామని తెలిపిన...
గతేడాది పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ప్రారంభించగా ఈ విద్యా సంవత్సరం మొత్తం అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై సగం పని దినాలు పూర్తయినా ఇప్పటి వరకు అన్ని పాఠశాలల్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత విద్యాబోధన ప్రారంభం కాలేదు.
కారణాలు ఇవే...
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా విద్యాబోధన చేయాలని నిర్ధారించిన పాఠశాలల్లో అనేక అవరో దాలు ఎదురవుతున్నాయి. ప్రతీ పాఠశాలకు 5 కంప్యూటర్లు అందజేస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్ప టి వరకు పంపిణీ చేయలేదు. వేసవి సెలవుల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పినా ఇప్పటి వర కు ఏ ఒక్క పాఠశాలలో అమలుకాలేదు. దీంతో ఏఐ ఆధారిత విద్యాబోధన ప్రారంభమైన పాఠశాలల్లో ప్రభుత్వం ఇచ్చిన ఒక ట్యాబ్‌తో పాటు సమీపంలోని ఎంఈవో కార్యాలయాలు, ఉన్నత పాఠశాలల నుంచి కంప్యూటర్లు తెచ్చుకుని ఉపాధ్యాయుల ఫోన్ల నుండి ఇంటర్నెట్ అనుసంధానం చేసుకుంటూ బోధన కొనసాగిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలి పారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏఐ విద్యాబోధన అమలుకు సరిపడా కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, పోషకులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.


