కిక్కు.. ఎవరికో లక్కు..
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం సోమవారం లక్కీ నిర్వహించనున్నారు. డ్రా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి లక్కు ఎవరిని వరించనుందని టెండర్ దారుల్లో ఉత్కంఠ నెలకొంది. కొత్తగా టెండర్ వేసిన వారు మొదటి అవకాశంపై ఆశలు పెట్టుకుంటున్నారు.
వ్యాపారుల్లో ఆందోళన..
టెండర్ల ప్రక్రియలో పాల్గొనే వ్యాపారులు ప్రతీ దరఖాస్తుకు రూ.3లక్షల నాన్ రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. లక్కు తగలకపోతే ఆ మొత్తం తి రిగి రాదు. ఈ కారణంగా చాలామంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారు వెనుకడుగు వేశారు. గతంలో 50 నుంచి 90 దరఖాస్తులు వేసి లక్కు తగలకపోయినా అనుభవం ఉన్న వ్యాపారులు ఈసారి దూరంగా ఉన్నారు. కొంతమంది నాన్ రీఫెండబుల్ ఫండ్లలో కనీసం 50 శా తం రీఫండ్ ఇచ్చే విధానం అవలంబిస్తే, దరఖా స్తుల సంఖ్య రెట్టింపు అయ్యేదని అంటున్నారు.
నేడు లక్కీ డ్రా..
వైన్‌షాపుల వారీగా వచ్చిన దరఖాస్తుల నుంచి నేడు కలెక్టరేట్ భవనంలోని మీటింగ్ హాల్‌లో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు దారులకు ఇప్పటికే పాస్‌లు సైతం జారీ చేశారు. ఎకై ్సజ్ అధికారులు జారీ చేసిన పాస్ తీసుకుని వచ్చిన వారినే లోపలికి అనుమతిస్తారు. డిసెంబర్ 1 నుంచి నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా కొత్త వ్యాపారులు రెండేళ్ల కాలపరిమితితో వైన్స్ ప్రారంభించనున్నారు.
47 దుకాణాలకు 991 దరఖాస్తులు
నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 47 వైన్స్ దుకాణాలకు గతనెల 26న మొదలైన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 23న ముగిసింది. 991 దరఖాస్తులు రాగా ఒక్కో అప్లికేషన్‌కు రూ.3 లక్షల చొప్పున ఎకై ్సజ్‌శాఖకు రూ.29.73 కోట్ల ఆదాయం సమకూరింది.
అర్బన్‌లో 448, రూరల్‌లో 543..
మూడు మున్సిపాలిటీల పరిధిలో 19 వైను్‌ుస్ల ఉండగా 448 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా జిల్లా కేంద్రంలోని షాప్ నెంబర్ 1లో 34, 10లో 44, 11లో 35 దరఖాస్తులు అందాయి. రూరల్ ప్రాంతాల్లో 28 షాపులు ఉండగా 543 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా సారంగాపూర్ మండలంలోని షాప్ నెంబర్ 22, 23లో 35 చొప్పున దరఖాస్తులు అందాయి.
రిస్క్ తక్కువ.. ఇన్‌కాం ఎక్కువ
అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే రూరల్ ప్రాంతాల్లో రిస్క్ తక్కువే. దీంతో ఎక్కువ మంది రూరల్ ప్రాంతాల్లోని షాపులపైనే దృష్టి పెట్టారు. నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో రూ.60 లక్షల చొప్పున ఫీజు నిర్ణయించారు. వాటి పరిధిలోని 16 షాపులకుగానూ 8 షాపులకు 20లోపు దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తుకు ఒక్కరికే అనుమతి
వైన్స్‌షాపుల కేటాయింపు కోసం నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నాం. ఇందుకోసం ఏ ర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే దరఖాస్తుదారులకు పాస్‌లు జారీ చేశాం. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటలలోపు చేరుకోవాలి. ఎంట్రీపాస్ వెంట తెచ్చుకోవాలి. హాల్‌లోకి మొబైల్‌ఫోన్లకు అనుమతిలేదు. ఒక్క దరఖాస్తు నుంచి ఒక్కరినే అనుమతిస్తాం.
– అబ్దుల్ రజాక్, జిల్లా ఎకై ్సజ్ అధికారి


