ఎస్‌ఐఆర్ ఓటరు జాబితా సిద్ధం చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారుల ను ఆదేశించారు. శనివారం కలెక్టర్లతో వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. 2002లో రూపొందించిన ఎస్‌ఐఆర్ జాబితాను 2025 జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రిటర్నింగ్ అధికారులు, ఏ ఈఆర్‌వోలు, డిప్యూటీ తహసీల్దార్లు, బీఎల్‌వో సూ పర్‌వైజర్లతో నిరంతర సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతీరోజు లక్ష్యాలను నిర్ణయించి ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పద్ధతిగా అమలు చేయాలన్నారు. కేటగిరీ–‘ఏ’లోని వివరాలను నిర్ధారించి, ‘సి’, ‘డి’ కేటగిరీ వివరాలతో అనుసంధానం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సర్ఫరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


