బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా సురేశ్
ఖానాపూర్: తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మంత్రరాజం సురేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని నాంపెల్లిలోగల మెట్రోపొలిటన్ క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్‌లో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ల అధ్యక్షులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సు రేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కాగా, స్థానిక న్యాయవాదులు అభినందనలు తెలిపారు.


