‘పీవీటీజీల అభివృద్ధిపై నిర్లక్ష్యం’
బేల: గిరిజన గ్రామాల పీవీటీజీల అభివృద్ధి, సంక్షేమంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ ఆరోపించారు. మండలంలోని సదల్‌పూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన కుంరం సూరు, కుమురం భీం వర్ధంతికి ఆయన హాజరయ్యారు. పోరాటయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ గతేడాది దేశంలోని పీవీటీజీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ. 24వేల కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. అందులో భాగంగా తెలంగాణలో రూ. 24 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏకు నిధులు కేటాయించారని తెలిపారు. పీవీటీజీలకు రూ. 60 లక్షలతో మల్టీహాల్ నిర్మించాల్సి ఉండగా కేవలం రూ.45 లక్షలతో నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు. అంచనా వ్యయం తగ్గించడంలో అంతరాయం ఏముందని ప్రశ్నించారు. అనంతరం ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై నా కొడప సొనేరావ్‌ను గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్ర రాజు, జిల్లా అధ్యక్షుడు మడావి గోవింద్‌రావ్, డివిజన్ అధ్యక్షుడు టేకం గణేష్, ఆదిలాబాద్ రూరల్ మండల అధ్యక్షుడు కుమ్ర జలపత్‌రావ్, బేల మండల అధ్యక్షుడు కొడప జైవంత్, గ్రామ మాజీ సర్పంచ్ రాందాస్, ఆదివాసీ సీనియర్ నాయకుడు మడావి జంగు తదితరులు పాల్గొన్నారు.


