
మద్యం టెండర్లకు బారులు
నిర్మల్ టౌన్: జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ శనివారం రాత్రితో ముగిసింది. చివరి రోజు దరఖాస్తుకు చాలా మంది వచ్చారు. సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన విష యం తెలిసిందే. మొదటి నుంచి కొంత స్లోగా కొనసాగిన దరఖాస్తులు శుక్రవారం వరకు 413 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు శనివారం సాయంత్రం 6 గంటల వరకు మరో 342 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల ప్రక్రియ రాత్రి వరకు కొనసాగనుంది. ఫీజు పెంపు దరఖాస్తులపై ప్రభావం చూపిందని భావించగా చివరి వరకు అనుకున్న స్థాయిలో దరఖాస్తులు అందినట్లు సమాచారం.