
పక్కాగా పంటల లెక్క
లక్ష్మణచాంద: కొనుగోలు కేంద్రాల్లో పంట దిగుబ డులు విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలు, సాగు విస్తీర్ణం తదితర వివరాలు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి డిజిటల్ పద్ధతిలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలోని 19మండలాల్లోని 400 గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఏఈవోలు నమోదు చేస్తున్నారు.
3,66,430 ఎకరాల వివరాలు నమోదు
జిల్లా వ్యాప్తంగా ఏఈవోలు తమ క్లస్టర్ల పరిధిలోని గ్రామాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. ఏఈవోలు ప్రతీ పంట ఫొటో తీసి మొబైల్ యాప్‌లో పూర్తి స మాచారాన్ని అప్‌లోడ్ చేస్తున్నారు. ఇందులో మహిళా ఏఈవోలు 1,800 ఎకరాలు, పురుష ఏఈవోలు 2వేల ఎకరాల్లోని పంటల వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లావ్యాప్తంగా వరి 1,14,638 ఎకరాలు, పత్తి 1,26,075, సోయాబీన్ 1,07,052, మొక్కజొన్న 12,835, కంది 5,719, పెసర 52, మినుము 59 ఎకరాలకు సంబంధించి పంటల నమోదు పూర్తి చేశారు.
రైతులకు కలిగే ప్రయోజనాలు
ఇప్పటికే 95శాతం పూర్తి
వ్యవసాయశాఖ ఆదేశాలతో జిల్లాలో చేపట్టిన పంటల వివరాల నమోదు 95శాతం పూర్తయింది. మిగతా ఐదు శాతం త్వరగా పూర్తి చేస్తాం.
– అంజిప్రసాద్, డీఏవో

పక్కాగా పంటల లెక్క