
పత్రికాస్వేచ్ఛను హరించొద్దు
లక్ష్మణచాంద: పత్రికాస్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని లక్ష్మణచాంద ప్రెస్‌క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. నిజాలను నిగ్గు తేలుస్తున్న ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడడాన్ని తప్పు పట్టారు. ఎడిటర్ ధనంజయరెడ్డి, పాత్రికేయులను అక్రమ కేసులతో వేధించడంపై మండిపడ్డారు. వెంటనే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
పునరావృతం కానివ్వొద్దు
నిజాలు వెలికితీస్తున్న ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టడం సరికాదు. పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగించడం శోచనీయం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.
– గోలి గంగాధర్, లక్ష్మణచాంద ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు
తప్పుడు కేసులు సరికాదు
పత్రికాస్వేచ్ఛను హరించడం సరికాదని సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెట్టడం సరికాదు. ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు వెంటనే ఎత్తి వేయాలి.
– కోరుకొప్పుల రాజాగౌడ్, లక్ష్మణచాంద ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి

పత్రికాస్వేచ్ఛను హరించొద్దు

పత్రికాస్వేచ్ఛను హరించొద్దు