
వేదవతి శిలకు దారేది..?
బాసర: శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకు ని.. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు ని త్యం వేల సంఖ్యలో భక్తులు బాసరకు వస్తుంటారు. దర్శనం అనంతరం బస్టాండ్ ఎదుట ఉన్న పురాత న వేదవతి శిల సందర్శనకూ వెళ్తుంటారు. ఈ వే దవతి శిలను మరో రాయితో కొడితే అమ్మవారి సప్తస్వరాలు చెవిలో వినిపిస్తాయని భక్తులు పే ర్కొంటున్నారు. కానీ, వేదవతి శిల దగ్గరకు వెళ్లేందుకు సరైన మార్గం లేదు. ప్రస్తుతం శిల చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలే ఉన్నాయి. ఆలయ అధికారులు స్పందించి పరిసరాలు శుభ్రం చేసి సీసీ రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

వేదవతి శిలకు దారేది..?