
గూడేల్లో సంబురంగా దండారీ
ఖానాపూర్: దీపావళికి ముందు సంప్రదాయ ఉత్సవాల్లో ఒక్కటైన దండారీ ఉత్సవాలను ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో ఎత్మసార్, చాచో యి, సబాయి, పేన్ తదితర ఆదివాసీ దేవుళ్లకు పూ జలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుస్సాడీ నృత్యాలు చేశారు. మహిళలు రేలారేలా నృత్యాలు చేస్తూ, పురుషులు కోలాటం ఆడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అడవి సారంగాపూర్, జిల్లెడుకుంట గ్రామాల్లో శనివారం రాత్రి, ఆదివా రం రోజంతా ప్రత్యేక పూజలు చేశారు. పెంబి మండలం వస్‌పల్లి కొత్తగూడేనికి చెందిన ఆదివాసీలు అడవి సారంగాపూర్‌లో నిర్వహించిన ఉత్సవాలకు హాజరయ్యారు. సింగాపూర్ గోండుగూడకు చెందిన ఆదివాసీలు జిల్లెడుకుంట గ్రామానికి చేరుకుని ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం దేవుళ్ల వద్ద భేటీలు, పూజలు చేశారు. ఈ సందర్భంగా గుస్సాడీ వేషధారణలో చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో భీంరావు పటేల్, అంకుశ్‌రావు పటేల్, ఆడె గంగారాం, ఆత్రం రాజేశ్వర్, శంభు, బీర్సావ్, దేవరావు, బారిక్‌రావు, అర్జున్ పటేల్, పెందూర్ బొజ్జు, శ్యాంరావు, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
కడెం: మండలంలోని మైసంపేట్, చిట్యాల్, ఇస్లాంపూర్, దోస్త్‌నగర్ తదితర ఆదివాసీ గూడేల్లో దండా రీ సంబురాలు కొనసాగుతున్నాయి. ఆదివారం మై సంపేట్ ఆదివాసీలు మండలకేంద్రంలోని కుమురంభీం విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

గూడేల్లో సంబురంగా దండారీ