బాసరలో శృంగేరీ పీఠాధిపతి..
బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానంలో శృంగేరీ శారదా పీఠాధిపతి జగద్గురువు విధుశేఖర భారతీ మహాస్వామివారు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిర్మల్‌టౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. బీసీ జేఏసీ శనివారం తలపెట్టిన బంద్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంచారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట వివిధ పార్టీల నాయకులు ధర్నా చేశారు. ఉదయం 7 గంటల నుంచే బీసీ కుల సంఘాలు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు బీసీ నినాదాలతో ర్యాలీలు నిర్వహించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ముందుగానే సెలవులు ప్రకటించాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. బంద్‌లో భాగంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కేలా అన్ని పార్టీల నాయకులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
నిర్మానుష్యంగా నిర్మల్
ఆర్టీసీ బస్టాండ్
నిర్మల్
నిర్మల్