పత్రికా స్వేచ్ఛపై దాడి ఆక్షేపణీయం | - | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛపై దాడి ఆక్షేపణీయం

Oct 19 2025 6:47 AM | Updated on Oct 19 2025 6:47 AM

పత్రి

పత్రికా స్వేచ్ఛపై దాడి ఆక్షేపణీయం

నిర్మల్‌టౌన్‌: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై సాగిస్తున్న నిర్బంధకాండను నిర్మల్‌ జిల్లాకేంద్రంలో అన్ని పాత్రికేయ సంఘాలు, నిర్మల్‌ ప్రెస్‌ క్లబ్‌ ముక్తకంఠంతో ఖండించాయి. శనివారం స్థానిక ప్రెస్‌ క్లబ్‌ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వాలే కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమన్నారు. వార్తలు రాస్తే పోలీసులతో విచారణ చేయించే ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని, సాక్షి ఎడిటర్‌ ధనంజయరెడ్డి విచారణ పేరిట నిర్బంధం చేయడం ఖండిస్తున్నామన్నారు. నిరసనలో సీనియర్‌ జర్నలిస్టులు అల్లం అశోక్‌, శ్రీనివాస్‌, రాసం శ్రీధర్‌, జల్ద మనోజ్‌, గుమ్ముల అశోక్‌, శ్రీనివాస్‌, పూసల పోశెట్టి, రాంపల్లి నరేందర్‌, వసి ఉల్లాఖాన్‌, దాసరి వేణుగోపాల్‌, రామేశ్వర్‌, సురేశ్‌, ప్రశాంత్‌, అక్తర్‌, శశికాంత్‌, హరీశ్‌, రాహుల్‌గౌడ్‌, భోజన్న, ప్రేమ్‌, శేషగిరి, టీయూడబ్ల్యూజే(ఐజేయూ), టీయూడబ్ల్యూజే(143), టీఎస్‌జేయూ, టీజేడబ్ల్యూఎఫ్‌, జాట్‌, మున్నూరుకాపు జర్నలిస్టు అసోసియేషన్‌ తదితర పాత్రికేయ సంఘాలతోపాటు నిర్మల్‌ ప్రెస్‌క్లబ్‌ బాధ్యులు పాల్గొన్నారు.

ప్రభుత్వం తీరు సరికాదు..

ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికావ్యవస్థను ప్రతిఒక్కరూ గౌరవించాలి. రాజకీయ ధోరణిలో సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపట్టడం ఎంతమాత్రం సరికాదు. దీన్ని ఖండిస్తున్నాం. –వసీఉల్లాఖాన్‌,

నిర్మల్‌ ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి

స్వేచ్ఛను అడ్డుకోవడమే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలీసులు సాక్షి ఎడిటర్‌ ధనంజయ్‌రెడ్డిని విచారణ పేరిట గంటలపాటు నిర్భంధంలో ఉంచడం పత్రికాస్వేచ్ఛను అడ్డుకోవడమే అవుతుంది. ప్రభుత్వాలు ఈ కక్షసాధింపు ధోరణి మానుకోవాలి. – ఎంఏ.వసీమ్‌,

నిర్మల్‌ ప్రెస్‌క్లబ్‌ గౌరవ సలహాదారు

పత్రికాస్వేచ్ఛకు విఘాతం..

ఏ ప్రభుత్వమైనా పత్రికాస్వేచ్ఛను కాపాడేందుకు కృషిచేయాలే కానీ.. ఇలా కక్షసాధింపు ధోరణిలో వ్యవహరించడం సమంజసం కాదు. సాక్షిపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్బంధకాండను వ్యతిరేకిస్తున్నాం.

–పొన్నం రాహుల్‌గౌడ్‌, జర్నలిస్టు

అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ(జాట్‌)

జిల్లాబాధ్యుడు

నిర్బంధకాండను సహించేది లేదు..

పత్రికాస్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై చేస్తున్న నిర్బంధకాండను సహించేది లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం, పోలీసులు కక్షసాధింపు ధోరణి మానుకోవాలి. లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తాం.

– అల్లం అశోక్‌, టీయూడబ్ల్యూజే(143) నేషనల్‌ కౌన్సిల్‌మెంబర్‌

పత్రికా స్వేచ్ఛపై దాడి ఆక్షేపణీయం 1
1/5

పత్రికా స్వేచ్ఛపై దాడి ఆక్షేపణీయం

పత్రికా స్వేచ్ఛపై దాడి ఆక్షేపణీయం 2
2/5

పత్రికా స్వేచ్ఛపై దాడి ఆక్షేపణీయం

పత్రికా స్వేచ్ఛపై దాడి ఆక్షేపణీయం 3
3/5

పత్రికా స్వేచ్ఛపై దాడి ఆక్షేపణీయం

పత్రికా స్వేచ్ఛపై దాడి ఆక్షేపణీయం 4
4/5

పత్రికా స్వేచ్ఛపై దాడి ఆక్షేపణీయం

పత్రికా స్వేచ్ఛపై దాడి ఆక్షేపణీయం 5
5/5

పత్రికా స్వేచ్ఛపై దాడి ఆక్షేపణీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement