బాస్కెట్ బాల్ జిల్లా జట్ల ఎంపిక
లక్ష్మణచాంద: మండలంలోని పీచర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి అండర్–14 బాస్కెల్ బాల్ పోటీలు శనివారం నిర్వహించా రు. ఎంపీడీవో రాధ, ఎంఈవో అశోక్‌వర్మ పో టీలను ప్రారంభించారు. ఇందులో ప్రతిభ కనభరిచిన విద్యార్థులను జోనల్ స్థాయికి ఎంపిక చేశారు.
బాలుర జిల్లా జట్టు..
వై.ముత్యం, ఎస్.శరత్, ఎస్.సంజుపాల్, రిషి, సాత్విక్, హర్షిత్, వెంకటరమణ, శ్రియాన్, రాకేశ్, లోకేష్, సుశీల్‌జాన్సన్, బన్నీ, స్టాండ్ బైలుగా లేవినోస్, నిఖిలేష్, శివకుమార్.
బాలికల జిల్లా జట్టు..
సహస్రరెడ్డి, కీర్తన, జగశ్రీ,సమికేశ్‌రెడ్డి, వెన్నెల, రినూత్న, నిహారిక, హర్షిత, దీక్షిత, అమూల్య, నందిని, ప్రణవి, స్టాండ్‌బైగా నైనిక .
17 మందిపై కేసు
లోకేశ్వరం: మండలంలోని బామ్ని(కే) గ్రామానికి చెందిన వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు కలిపి 17 మందిపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆశోక్ తెలిపారు. గ్రామానికి చెందిన రైతు నడిషారం మైసన్న గ్రామ శివారులోని ఎర్రకుంట చెరువు ప్రాంతంలో రెండు ఎకరాల శిఖం కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఈ భూమిని పశువులను మేపేందుకు ఖాళీగా వదిలేయాలని వీడీసీ సభ్యులు మైసన్నను అదేశించారు. అయినా ఈ ఏడాది వరి సాగు చేశాడు. దీంతో వీడీసీ సభ్యులు మైసన్నతో ఎవరూ మాట్లాడొద్దని తీర్మానం చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, 17 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


