
క్రీడలతో మానసికోల్లాసం
లక్ష్మణచాంద: క్రీడలతో విద్యార్థులకు మానసికోల్లాసంతోపాటు శారీరక దారుఢ్యం మెరుగుపడుతుందని డీఈవో భోజన్న అన్నారు. మండలంలోని వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు ఆటలపై ఆసక్తి, అభిరుచి కలిగి ఉండాలన్నారు. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఉపయోగపడతాయని తెలిపారు. పాఠశాలల్లో విద్యతోపాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కాసేపు కబడ్డీ ఆడారు. తనకు కబడ్డీ చాలా ఇష్టమని, తాను పాఠశాలస్థాయిలో ఆడిన ఆటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆర్.అశోక్‌వర్మ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ రవీందర్‌గౌడ్, పీఈటీ వై.రమణారావు, మాజీ సర్పంచ్ లింగాగౌడ్, ఉప సర్పంచ్ మోహన్, వీడీసీ సభ్యులు పోలాస గోవర్ధన్, రాజేంద్రప్రసాద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జట్లు ఇవే..
అండర్ 14 బాలికల జట్టు
అమ్రిన్ బేగం, హర్షవర్ధని, సమంత, అక్షర, అదితి, సాక్షి, రసజ్ఞ, నవనీత, చందన, హర్షిణి, గంగోత్రి, శరణ్య. స్టాండ్ బైగా మనస్విని, అమీలియా, దీక్ష,శ్రీ, నిత్యను ఎంపిక చేశారు.
అండర్ 14 బాలుర జట్టు
అజయ్, ఎ.అజయ్, సిద్దు, సాయి, రోమన్‌పాషా, వరుణ్ సందేశ్, పైజాన్, సంజీవ్, నాగ చరణ్, అర్జున్, కవి కుమార్, శేషారావు. స్టాండ్ బైలుగా సుశాంత్, అఖిల్, నాగరాజు, శివసాయి, జశ్వంత్ ఎంపికయ్యారు.