
శబరిమలకు పాదయాత్ర
కుంటాల: జిల్లాలోని ఆయా మండలాల నుంచి అయ్యప్ప దీక్షాపరులు ఆదివారం బాసర జ్ఞాన సరస్వతిదేవి ఆలయంలో పూజలు నిర్వహించి శబరిమల అయ్యప్ప సన్నిధానానికి పాదయాత్రగా వెళ్లనున్నారు. జిల్లాలోని 40 మంది స్వాములు 45 రోజలు పాదయాత్ర చేసి స్వా మివారి సన్నిధానం చేరుకుంటారని తెలిపారు. కుంటాల మండలం లింబా(కె) గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి అయ్యప్పస్వామి శనివారం గ్రామంలోని తూర్పు ముఖ హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించగా గ్రామస్తులు సాగనంపారు. రాత్రి బాసరలో బస చేసి ఆదివారం పాదయాత్రగా వెళ్లనున్నట్లు అయ్యప్ప స్వాములు తెలిపారు.