
ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై సోమవారం సమీక్ష చేశారు. ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలన్నారు. ఈమేరకు సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్, కార్యక్రమం నిర్వహణ అధికారులు డాక్టర్ రాజా రమేశ్, నయనారెడ్డి, ఆశిష్‌రెడ్డి, సౌమ్య, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి రవీందర్, డీపీవో రాంచందర్ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న రవీంద్రనాయక్