నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Sep 23 2025 7:19 AM | Updated on Sep 23 2025 7:19 AM

నిర్మ

నిర్మల్‌

● భైంసాలో ఘనంగా సద్దుల బతుకమ్మ ● ఆడిపాడిన మహిళలు మంగళవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025 ● ఎస్పీ జానకీషర్మిల

న్యూస్‌రీల్‌

ఉర్రూతలూగించే పాటలు

రెండు దశాబ్దాలుగా బతుకమ్మ పాటలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పాటల రచనలు, చిత్రీకరణతో ఇప్పుడు బతుకమ్మ వేడుకల్లో ఊరూరా మార్మోగుతున్నాయి.

IIలోu

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ..

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి

నిర్మల్‌టౌన్‌: ఆర్జీదారుల సమస్యను పోలీస్‌ అధికారులు వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా ఉండాలని ఎస్పీ డాక్టర్‌ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు.

భైంసాటౌన్‌: పట్టణంలో సోమవారం సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ఉదయం నుంచే తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం ఆయా కాలనీల నుంచి మహిళలు, యువతులు బతుకమ్మ పాటలకు కోలాటాలతో నృత్యాలు చేస్తూ బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ప్రధాన రహదారి మీదుగా స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ మున్నూరుకాపు మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావుపటేల్‌ పాల్గొని బతుకమ్మ ఎత్తుకుని నృత్యం చేశారు. మహిళలు, యువతులు భారీగా తరలిరాగా, ప్రాజెక్టు వద్ద బతుకమ్మలను ఉంచి ఆడిపాడారు. డీజే పాటలకు నృత్యాలు చేశారు. పొద్దుపోయాక బతుకమ్మలను ప్రాజెక్టు నీటిలో నిమజ్జనం చేశారు. పోయిరా గౌరమ్మ పోయిరా అంటూ సాగనంపారు. సత్తుపిండి వాయినం ఇచ్చిపుచ్చుకున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

బాసర: బాసర ట్రిపుల్‌ ఐటీలో సోమవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చారు. అనంతరం ఆడిపాడారు. డీజే పాటలకు స్టెప్పులేశారు. అంతకుముందు ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్‌ మాట్లాడుతూ బతుకమ్మను ఏవిధంగా అందంగా పేర్చుతామో విద్యార్థులు తమ జీవితాలను కూడా అంతే అందంగా నిర్మించుకోవాలని సూచించారు. బతుకమ్మ పేర్చిన అధ్యాపకులు, విద్యార్థులకు బహుమతులు అందించారు.

ట్రిపుల్‌ఐటీలో వేడుకలు

నిర్మల్‌1
1/7

నిర్మల్‌

నిర్మల్‌2
2/7

నిర్మల్‌

నిర్మల్‌3
3/7

నిర్మల్‌

నిర్మల్‌4
4/7

నిర్మల్‌

నిర్మల్‌5
5/7

నిర్మల్‌

నిర్మల్‌6
6/7

నిర్మల్‌

నిర్మల్‌7
7/7

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement