
ఘనంగా నిర్వహించాలి
బతుకమ్మ
ఉత్సవాలు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై సో మవారం సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధి కారులు తమతమ కార్యాలయాల్లో సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగ నిర్వహించాలని సూ చించారు. సద్దుల బతుకమ్మ రోజున ఊరేగింపులో అందరూ భాగస్వాములు కావాలన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయాలన్నారు. చెరువుల వద్ద బతుకమ్మ నిమజ్జనం ప్రాంతాల్లో లైటింగ్, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సద్దుల బతుకమ్మ నిర్వహించేందుకు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘పోషణ మాసం’ పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీవైఎస్‌వో శ్రీ కాంత్‌రెడ్డి, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న, డీపీఆర్వో విష్ణువర్ధన్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, డీఈ హరి భువన్, సీడీపీవో సరిత, అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎంల గోదాంను కలెక్ట ర్ అభిలాష అభినవ్ సోమవారం పరిశీలించారు. గోదాంలో భద్రపరచిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను తనిఖీ చేసి సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లు మరింత బలో పేతం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీ సు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సర్ఫరాజ్, సిబ్బంది రాజశ్రీ, పార్టీల నేతలు ఉన్నారు.