
మైనారిటీ మహిళలకు ఆర్థిక భరోసా
ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ప్రారంభం.. స్కీమ్ కింద ఒంటరి మహిళలకు రూ.50 వేల ఆర్థిక సాయం ‘రేవంతన్న కా సహారా – మిస్కీన్ లే’ కింద రూ.లక్ష గ్రాంట్
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతి కోసం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’, ’రేవంతన్నకా సహారా మిస్కీన్ లే’ పేరుతో వచ్చిన పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబన, ఆట్టడుగు సముదాయాల సామాజిక ఉద్ధరణకు దోహదపడతాయి. ఈ నెల 19న సెక్రటేరియేట్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం రూ.30 కోట్ల బడ్జెట్‌తో అమలు చేసే ఈ పథకాలకు దరఖాస్తులు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 6 వరకు టీజీవోబీఎమ్‌ఎమ్‌ఎస్ పోర్టల్(tgobmms.cgg.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు.
ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన..
ఈ పథకం మైనారిటీ మహిళలు(ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ వర్గాలకు చెందినవారు) ఆర్థికంగా స్వతంత్రంగా మారేలా సహాయపడుతుంది. వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహితలు, ఒంటరి మహిళలకు చిన్న వ్యాపారాల ప్రారంభానికి ఒక్కొక్కరికీ రూ.50 వేల గ్రాంట్ అందిస్తారు. ఇది రాష్ట్రంలో మైనారిటీ మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ఉద్యోగాల సృష్టికి దోహదపడుతుంది.
అర్హతలు:
రేవంతన్నకా సహారా మిస్కీన్ లే..
ముస్లిం సముదాయాల అభ్యున్నతికి ఈ పథకం రూపొందించబడింది. ఫకీర్, దూదేకుల, ఇతర ఆట్టడుగు ముస్లిం వర్గాల సభ్యులకు మోపెడ్‌లు, బైక్‌లు లేదా ఈ–బైక్‌లు అందించడానికి రూ.లక్ష గ్రాంట్ (100% రాయితీ) మంజూరు చేస్తారు. తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) ద్వారా అమలు చేసే ఈ చర్య ఆర్థిక బలహీనతను తగ్గించి, రోజువారీ జీవనాన్ని మెరుగుపరుస్తుంది.
అర్హతలు:
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి..
జిల్లాలో అర్హులైన మైనార్టీలు దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు కలెక్టరేట్‌లోని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఎఫ్3 లో సంప్రదించాలి,
– ఆర్.మోహన్‌సింగ్, జిల్లా అల్పసంఖ్యాకుల సంక్షేమ అధికారి

మైనారిటీ మహిళలకు ఆర్థిక భరోసా